CUET UG 2024 Results I సీయూఈటీ (యూజీ) ఫలితాలు విడుదల
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన CUET UG 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
Published :28 July 2024 19:05 IST
https://results.eenadu.net/news.aspx?newsid=28072024
Copy Link
దిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీయూఈటీ (యూజీ) పరీక్ష ఫలితాలు (CUET UG 2024 Results) వచ్చేశాయి. ఈ ఫలితాలను ఎన్‌టీఏ (NTA) అధికారులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల్లో 2024 సంవత్సరానికి గాను సాధారణ యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-యూజీ 2024)ను మే 15 నుంచి 29వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ ఫలితాలు జూన్ 30నే విడుదల కావాల్సి ఉండగా.. నీట్, నెట్ పరీక్షల వ్యవహారం వివాదాస్పదం కావడంతో జాప్యం చోటుచేసుకుంది. భారత్‌లోని 379 నగరాల్లో, విదేశాల్లోని 26 నగరాల్లో నిర్వహించిన CUET UG 2024 పరీక్షకు దాదాపు 13.48లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి