SBI clerk prelims Results 2025 | ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐలో క్లర్క్స్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు(SBI clerk prelims Results 2025) విడుదలయ్యాయి.
By Education News Team
Published :28 Mar 2025 21:01 IST
https://results.eenadu.net/news.aspx?newsid=28032025
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో క్లర్క్స్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు(SBI clerk prelims Results 2025) విడుదలయ్యాయి. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి లాగిన్ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
ప్రిలిమ్స్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
మొత్తం 13,735 జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్టు & సేల్స్) ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్ 12 నుంచి ఈ ఏడాది జనవరి 7వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి తాజాగా ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించిన ఎస్‌బీఐ.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థుల కాల్ లెటర్లను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. మెయిన్స్ పరీక్షకు ఏప్రిల్ 10, 12 తేదీలను తాత్కాలికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ను సందర్శించండి.
- హోమ్‌పేజీలో పైన కనిపించే కెరీర్స్ అనే లింక్‌పై క్లిక్ చేయండి
- జూనియర్ అసోసియేట్స్ నియామకాలకు సంబంధించిన లింక్ కనబడుతుంది
- ఎస్‌బీఐ జూనియర్ అసోసియేట్స్ ప్రిలిమ్స్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేసి మీ వివరాలను సబ్‌మిట్ చేయండి
- మీరు సాధించిన స్కోరు కార్డును డౌన్‌లోడ్ చేసుకొని భవిష్యత్తు వినియోగం కోసం భద్రపరుచుకోండి.