TET 2024 Key | తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ విడుదల

TET 2024 Key | తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ విడుదల

జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రిలిమినరీ కీ విడుదలైంది.

Eenadu icon
By Education News Team Published :24 Jan 2025 20:46 IST

Telangana TET Key| ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణ టెట్‌ ప్రాథమిక కీ (TET Preliminary Key)విడుదలైంది. జనవరి 2 నుంచి 20 తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024) జరిగిన విషయం తెలిసిందే. పేపర్‌-1, 2కు సగటున 2,75,753 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,05,278 మంది (74.44 శాతం) హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ ఇటీవల వెల్లడించింది. తాజాగా టెట్‌ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌ (TET Response Sheets Download Here)లను సైతం అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. టెట్‌ కీపై అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలని అధికారులు సూచించారు.

టెట్‌ ప్రిలిమినరీ  కీ కోసం క్లిక్‌ చేయండి

అభ్యంతరాల కోసం క్లిక్‌ చేయండి