APOSS 10th, Inter Results | ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ(APOSS)నిర్వహించిన పది, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి
By Education News Team
Published :23 Apr 2025 11:10 IST
https://results.eenadu.net/news.aspx?newsid=23042025-aposs-ssc-and-inter-results
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం(APOSS)ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించిన పది, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. పదోతరగతి రెగ్యులర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలతో పాటు వీటిని కూడా మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఓపెన్ ఎస్.ఎస్.సి పరీక్షలు 26,679 మంది రాయగా, ఇంటర్ పరీక్షలకు 63,668 మంది విద్యార్థులు హాజరయ్యారు. పదిలో 37.93%, ఇంటర్ లో 53.12% ఉత్తీర్ణత నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమ అడ్మిషన్ నెంబర్ లేదా రోల్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చు.
ఓపెన్ స్కూల్ టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఏప్రిల్ 26 నుంచి మే 5 వరకు విద్యార్థులు ఏదైనా ఏపీ ఆన్లైన్ కేంద్రంలో రుసుం చెల్లించవచ్చని అధికారులు సూచించారు. ఒక్కో సబ్జెక్టు రీ- కౌంటింగ్ కోసం రూ.200, జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్ కోసం రూ.1000 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని పేరొన్నారు.