SSC Recruitment | ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్‌-1 పరీక్ష ఫలితాలు విడుదల.. మార్కులు తెలుసుకోవచ్చిలా!

SSC Recruitment | ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్‌-1 పరీక్ష ఫలితాలు విడుదల.. మార్కులు తెలుసుకోవచ్చిలా!

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ జేఈ పేపర్‌ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Published :20 August 2024 22:05 IST

SSC Recruitment| దిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 1,765 జూనియర్‌ ఇంజినీర్‌ (JE) ఉద్యోగాలకు నిర్వహించిన పేపర్‌ 1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌/మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో కలిపి మొత్తంగా 16,223 మంది అభ్యర్థులు పేపర్‌-2 రాసేందుకు షార్ట్‌లిస్ట్‌ అయినట్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) వెల్లడించింది. పేపర్‌ 1కు సంబంధించిన క్వశ్చన్‌ పేపర్లు, రెస్పాన్స్‌ షీట్లతో కలిపి ఫైనల్‌ ఆన్షర్‌ కీని ఆగస్టు 22వ తేదీన తమ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. 

SSC జేఈ పేపర్‌-1 పరీక్ష ఫలితాల (జాబితా-1) కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌ఎస్‌సీ జేఈ పోస్టుల భర్తీకి పేపర్‌ 1 పరీక్షను జూన్‌ 5 నుంచి 7వరకు దేశ వ్యాప్తంగా నిర్వహించిన విషయం తెలిసిందే. క్వాలిఫైడ్‌/నాన్‌ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల మార్కులను ఆగస్టు 22న అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఎస్‌ఎస్‌సీ వెల్లడించింది. రిజిస్టర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎంటర్‌ చేసి అభ్యర్థులు ఈనెల 22 సాయంత్రం 6గంటల నుంచి సెప్టెంబర్‌ 5 సాయంత్రం 6గంటల వరకు మార్కులను చెక్‌ చేసుకోవచ్చని తెలిపింది. 

SSC జేఈ పేపర్‌-1 పరీక్ష ఫలితాల (జాబితా-2) కోసం క్లిక్‌ చేయండి

నిద్రలోనూ ఆలోచనలేనా?ఈ ‘బటర్‌ఫ్లై ట్యాపింగ్‌’ టెక్నిక్‌ ట్రై చేయండి!

పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు దేశ వ్యాప్తంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌ బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులు కానున్నారు. ఎంపికైన వారికి ఏడో వేతన స్కేలు ప్రకారం నెలకు వేతనం రూ.35,400- రూ.1,12,400 గా చెల్లించనున్నారు.