AISSEE 2026 | సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష.. మీ పరీక్ష కేంద్రం ఏ సిటీలో తెలుసా?
ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE 2026)కు అడ్వాన్స్ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి.
By Education News Team
Published : 07 Jan 2026 14:49 IST
https://results.eenadu.net/news.aspx?newsid=712025aissee
ఇంటర్నెట్ డెస్క్: ఆలిండియా సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష (AISSEE 2026)కు అడ్వాన్స్ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 464 కేంద్రాల్లో జనవరి 18న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. విద్యార్థులు ఈ https://www.nta.ac.in/, https://exams.nta.nic.in/sainik-school-society/ వెబ్‌సైట్లలో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు.
సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం క్లిక్ చేయండి
ఇది కేవలం పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో ముందస్తుగా తెలిపే సమాచారం తప్ప అడ్మిట్ కార్డు కాదని విద్యార్థులు గమనించాలని ఎన్టీఏ సూచించింది. త్వరలోనే అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని పేర్కొంది. ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు వస్తే అభ్యర్థులు 011-40759000, 011-69227700 నంబర్లను లేదా aissee@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని సూచించింది.