JEE(Main) Session- 2 | జేఈఈ (మెయిన్‌) రెండో సెషన్‌.. మీ పరీక్ష కేంద్రం ఏ నగరంలో తెలుసుకోండిలా!

JEE(Main) Session- 2 | జేఈఈ (మెయిన్‌) రెండో సెషన్‌.. మీ పరీక్ష కేంద్రం ఏ నగరంలో తెలుసుకోండిలా!

ఏప్రిల్‌ 2 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ (JEE Main 2025)సెషన్‌- 2 పరీక్షలకు అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published :20 Mar 2025 17:50 IST

JEE (Main) 2025 Session 2 exam | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏప్రిల్‌ 2 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ (JEE Main 2025)సెషన్‌- 2 పరీక్షలకు ఎన్‌టీఏ(NTA) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది. ఏప్రిల్‌ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్‌ -1 (బీఈ/బీటెక్‌); ఏప్రిల్‌ 9న పేపర్‌ -2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా వివిధ నగరాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. మీకు పరీక్ష ఏ తేదీ ఉంటుంది? ఏ సిటీలో పరీక్ష కేంద్రం ఉంటుందనే వివరాలను అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల్లో పేర్కొంటారు. వీటిని డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌/పుట్టిన తేదీతో పాటు క్యాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం క్లిక్‌ చేయండి

ఇది అడ్మిట్‌ కార్డు కాదని మాత్రం విద్యార్థులు గమనించాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఎగ్జామినేషన్‌ సెంటర్‌ ఏ నగరంలో వచ్చిందో ముందుగా తెలుసుకొనేందుకు వీలుగా ఈ స్లిప్పులను విడుదల చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 పరీక్ష అడ్మిట్‌ కార్డుల్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.  ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు డౌన్‌లోడ్‌/చెకింగ్‌లో ఏదైనా సమస్య తలెత్తితే.. 011-40759000 నంబర్‌కు కాల్‌ చేయొచ్చు లేదా jeemain@nta.ac.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని సూచించింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌ చేసుకోవాలని కోరింది.