EMRS Admit Cards |‘ఏకలవ్య’ స్కూల్స్‌లో 7,267 పోస్టుల భర్తీకి పరీక్ష.. అడ్మిట్‌ కార్డులు విడుదల

EMRS Admit Cards |‘ఏకలవ్య’ స్కూల్స్‌లో 7,267 పోస్టుల భర్తీకి పరీక్ష.. అడ్మిట్‌ కార్డులు విడుదల

ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉద్యోగ నియామక పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :12 Dec 2025 19:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఉద్యోగ నియామక పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. మొత్తం 7,267 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 13 నుంచి జరిగే పరీక్షలకు నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. ప్రిన్సిపల్‌, పీజీటీ, టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌, స్టాఫ్‌నర్సు, అకౌంటెంట్‌, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ సహా పలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 13, 14, 21 తేదీల్లో రాతపరీక్ష జరగనుంది. అభ్యర్థులు తమ యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

అడ్మిట్‌ కార్డులో ఇవి సరిచూసుకోండి.. 

రాతపరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకున్నాక.. అభ్యర్థి పేరు, ఫొటో, ఇతర వ్యక్తిగత వివరాలు, రోల్‌ నంబర్‌, ఎగ్జామ్ సెంటర్‌ పేరు, పూర్తి అడ్రస్‌, పరీక్ష తేదీ, షిఫ్టు, రిపోర్టింగ్‌ సమయం, సంతకం, పరీక్షకు సంబంధించిన సూచనలు వంటివి సరిచూసుకోండి. ఏవైనా వివరాలు సరిపోలకపోతే వెంటనే తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. 

పరీక్ష కేంద్రంలోకి వీటికి నో ఎంట్రీ!

పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌లు, పెన్‌ డ్రైవ్‌లు, స్టోరేజ్ డివైజ్‌లు, బ్లూటూత్‌ డివైజ్‌లు, ఏవైనా ఇతర విలువైన పరికరాలను అనుమతించరు.