TG SSC exams schedule | తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

TG SSC exams schedule | తెలంగాణలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ (Telangana SSC Exams 2026 Schedule) విడుదలైంది.

Eenadu icon
By Education News Team Updated :10 Dec 2025 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ (Telangana SSC Exams 2026 Schedule) విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అన్ని జిల్లాల డీఈవోలు, విద్యాసంస్థల ప్రతినిధులు ఈ షెడ్యూల్‌ను ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్‌, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్‌ కోర్సులు చదివే ప్రతి విద్యార్థికీ తెలియజేయాలని సూచించింది. అలాగే, ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది.

  • మార్చి 14- ఫస్ట్‌ లాంగ్వేజ్‌ - (గ్రూప్‌ -ఎ), ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పార్ట్‌-1, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ -పార్ట్‌ 2
  • మార్చి 18 - సెకండ్‌ లాంగ్వేజ్‌
  • మార్చి 23 - థర్డ్‌ లాంగ్వేజ్‌ (ఇంగ్లిష్‌)
  • మార్చి 28- గణితం (మ్యాథమెటిక్స్‌)
  • ఏప్రిల్‌ 2 - సైన్స్‌ (పార్ట్‌ -1) - భౌతిక శాస్త్రం (ఫిజికల్‌ సైన్స్‌)
  • ఏప్రిల్‌ 7 - సైన్స్‌ - పార్ట్‌ 2 - బయోలాజికల్‌ సైన్స్‌
  • ఏప్రిల్‌ 13 - సాంఘిక శాస్త్రం (సోషల్‌ స్టడీస్‌ )
  • ఏప్రిల్‌ 15 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1; ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు (థియరీ)
  • ఏప్రిల్‌ 16 - ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్‌ పేపర్‌ -2