Postal GDS Results | తపాలాశాఖలో 21,413 ఉద్యోగాలు.. మూడో షార్ట్‌ లిస్ట్‌ వచ్చేసింది

Postal GDS Results | తపాలాశాఖలో 21,413 ఉద్యోగాలు.. మూడో షార్ట్‌ లిస్ట్‌ వచ్చేసింది

దేశంలోని వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.

Eenadu icon
By Education News Team Published :19 May 2025 20:45 IST

Postal GDS Results | ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్(Postal) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్(GDS) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల మూడో జాబితాను తపాలా శాఖ అధికారులు విడుదల చేశారు.  మార్చిలో తొలి జాబితా, ఏప్రిల్‌లో రెండో జాబితాను విడుదల చేసిన అధికారులు.. తాజాగా మూడో జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో https://indiapostgdsonline.gov.in/లో అందుబాటులో ఉంచారు. (Postal GDS Merit List)

ఏపీ జీడీఎస్‌ మూడో జాబితా కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ జీడీఎస్‌ మూడో జాబితా కోసం క్లిక్‌ చేయండి

మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1215, తెలంగాణలో 519 చొప్పున పోస్టులను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు సంబంధించి విడుదల చేసిన మూడో జాబితాలో ఏపీ నుంచి 442 మంది; తెలంగాణ నుంచి  77 మంది చొప్పున షార్ట్‌ లిస్ట్‌ అయ్యారు. మూడో జాబితాకు ఎంపికైన అభ్యర్థులు జూన్‌ 3లోగా ధ్రువపత్రాలు పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు సెల్ఫ్‌ అటెస్టెడ్‌ ఫొటో కాపీలను రెండు సెట్‌లు తీసుకెళ్లాలి. 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా సేవలు అందిస్తారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతున్నారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లను అధికారులు రూపొందించారు.