SSC Exams Tips | టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచనలివే..!
ఏపీలో పదో తరగతి పరీక్షలు ఇప్పటికే ప్రారంభం కాగా.. తెలంగాణలో మార్చి 21 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వీవీ లక్ష్మీనారాయణ కీలక సూచనలు చేశారు.
By Education News Team
Published :18 Mar 2025 17:22 IST
https://results.eenadu.net/news.aspx?newsid=18032025-ssc-exams-tips
SSC Exams | ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో పదో తరగతి పరీక్షలు(SSC Exams) ఇప్పటికే ప్రారంభం కాగా.. తెలంగాణలో మార్చి 21 నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీబీఐ మాజీ జేడీ, జైభారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు వీవీ లక్ష్మీనారాయణ(VV Laxminarayana) పరీక్షల్లో వారు రాణించేలా కీలక సూచనలు చేశారు. పరీక్ష అనేది విద్యార్థుల ప్రిపరేషన్‌ను ప్రదర్శించే గొప్ప అవకాశమని పేర్కొంటూ.. అందరికీ ఆల్‌ది బెస్ట్ చెప్పారు. పరీక్షలు రాసే సమయంలో పొరపాట్లు చేయకుండా అనుసరించాల్సిన జాగ్రత్తలతో పాటు ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులకు ఆయన సూచించిన కొన్ని టిప్స్ ఇవే..
- పరీక్ష సమాయానికి ముందుగానే పరీక్ష కేంద్రం(Exam Centre) వద్దకు చేరుకోండి.
- హాల్‌టికెట్(Hall ticket)తో పాటు మీవెంట అదనంగా పెన్నులు ఉంచుకోండి.
- మీ ఏకాగ్రతను మెరుగుపరుచుకొనేందుకు పది సార్లు లోతుగా శ్వాస(Deep breath) తీసుకొని వదలండి.
- సమాధాన పత్రంలో హాల్‌టికెట్ నంబర్‌ను జాగ్రత్తగా ఎంటర్ చేయండి.
- మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయడం ఉత్తమమైన పద్ధతి
- మీరు రాసిన ప్రతి సమాధానం కింద కొంత స్థలం వదిలేయండి. తద్వారా మధ్యలో మీకు ఏవైనా పాయింట్లు మధ్యలో గుర్తుకు వస్తే తర్వాత అక్కడ రాసేందుకు వీలు కలుగుతుంది.
- పెద్ద పేరాలకు(Peragraphs) బదులుగా ఒక పాయింట్‌ను హైలైట్ చేస్తూ చిన్నచిన్న పేరాలుగా సమాధానాలను విభజించండి. కీలక అంశాలను అండర్‌లైన్ చేయడం ఉత్తమం.
- ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్న పట్ల మీకున్న అవగాహన(Understanding), సృజనాత్మకత(Creativity)ను ఎవాల్యుయేటర్‌కు తెలిసేలా అవసరమైన చోట డయాగ్రమ్స్, బొమ్మలు మొదలైనవి గీయండి.
- అన్ని ప్రశ్నలను సరిగా రాశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే, అడిషినల్ షీట్లను మీ మెయిన్ షీట్(Main sheet)కు జత చేశారో లేదో సరిచూసుకోండి.
- ఇంటికి వెళ్లాక తదుపరి పరీక్షకు సన్నద్ధత ప్రారంభించే ముందు కాసేపు విశ్రాంతి తీసుకోండి.
- పరీక్షల సమయంలో మంచి ఆహారం(Food) తీసుకోండి. తగినంత నిద్ర(Sleep) ఉండేలా జాగ్రత్తపడండి.
- పరీక్షల సమయంలో సెల్‌ఫోన్(Cell phone) జోలికి పోవద్దు.
- మీతో మీకే పోటీ అని గుర్తుపెట్టుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు.