UGC NET Results | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న యూజీసీ నెట్ పరీక్ష ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి
Published :17 Oct 2024 20:36 IST
https://results.eenadu.net/news.aspx?newsid=171024
UGC NET Results| ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తోన్న యూజీసీ నెట్ (జూన్) 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకు మొత్తం 83 సబ్జెక్టులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఎన్‌టీఏ (NTA) ప్రకటించింది. అక్టోబర్ 10న ఫైనల్ కీ విడుదల చేసిన అధికారులు.. తాజాగా స్కోర్ కార్డులను తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థులు తమ స్కోరు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కేటగిరీ వారీగా కటాఫ్ మార్కుల కోసం క్లిక్ చేయండి
ఇంటర్న్‌షిప్ చేయడం ఎందుకు ముఖ్యం? ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
యూజీసీ నెట్‌కు దేశ వ్యాప్తంగా 11,21,225మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 6.84లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 4970మంది జేఆర్‌ఎఫ్‌కు అర్హత సాధించగా.. 53,694మంది అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు, 1,12,070మంది పీహెచ్‌డీకి మాత్రమే క్వాలిఫై అయ్యారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) యూజీసీ నెట్ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.