CTET 2024 Notification | సీటెట్‌ (డిసెంబర్‌) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష తేదీ ఇదే.. దరఖాస్తులు షురూ..

CTET 2024 Notification | సీటెట్‌ (డిసెంబర్‌) నోటిఫికేషన్‌ వచ్చేసింది.. పరీక్ష తేదీ ఇదే.. దరఖాస్తులు షురూ..

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET December- 2024)కు దరఖాస్తులు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇవే..

Published :19 Sep 2024 20:28 IST

CTET 2024 Applications| దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET- December 2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సీటెట్‌ పరీక్షను 2024 డిసెంబర్‌ 1న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. ఆంగ్లం/హిందీ భాషల్లో జరిగే ఈ పరీక్షకు అక్టోబర్‌ 16 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

సీబీఎస్‌ఈ ‘సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌’ మెరిట్‌ స్కాలర్‌షిప్‌.. దరఖాస్తు చేశారా?

నోటిఫికేషన్‌లో ముఖ్యమైన పాయింట్లు..

  • సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. సీటెట్‌కు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
  • సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
  • మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1ను​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
  • పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్‌ -1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తారు.
  • దరఖాస్తుల్లో తప్పులను అక్టోబర్‌ 21 నుంచి 25వరకు సవరణ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లను పరీక్షకు రెండు రోజుల ముందు విడుదల చేస్తారు. ఫలితాలు జనవరి నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. 
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌. పరీక్ష సిలబస్‌, ఇతర వివరాలతో కూడిన బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి.