AP EAPCET I ఏపీ ఈఏపీసెట్‌ తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. సీటు ఎక్కడ వచ్చిందో చెక్‌ చేసుకోండి!

AP EAPCET I ఏపీ ఈఏపీసెట్‌ తొలి రౌండ్‌ సీట్ల కేటాయింపు.. సీటు ఎక్కడ వచ్చిందో చెక్‌ చేసుకోండి!

ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ విడుదలైంది. విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో చెక్‌ చేసుకొనేందుకు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయండి.

Published :17 July 2024 14:50 IST

 

అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కోసం క్లిక్‌ చేయండి

అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఇటీవల తొలి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించిన అధికారులు జులై 17న (బుధవారం) మొదటి రౌండ్‌ సీట్ల కేటాయింపునకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ మేరకు తమ అధికారిక వెబ్‌సైట్‌లో అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను అందుబాటులో ఉంచారు.  విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకొనేందుకు AP EAPCET హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు 17-22లోపు చేరాల్సి ఉంటుంది. జులై 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.