TG TET-2025 Applications | తెలంగాణ టెట్‌ 2025 దరఖాస్తులు షురూ.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో!

TG TET-2025 Applications | తెలంగాణ టెట్‌ 2025 దరఖాస్తులు షురూ.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో!

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET-2025)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Eenadu icon
By Education News Team Published :15 Apr 2025 15:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET-2025)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.  అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ నెల 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ సూచించింది. తెలంగాణ టెట్‌ మొదటి విడత నోటిఫికేషన్‌ను ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఏటా రెండుసార్లు టెట్‌ నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం మొదటి విడతకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. జూన్‌లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. 

టెట్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

ఎస్‌జీటీ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఎస్‌ఏ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పేపర్‌-2లో రెండు వేర్వేరు పేపర్లు (గణితం-సైన్స్, సాంఘికశాస్త్రం) ఉంటాయి. ఈసారి ఒక పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 రుసుంగా నిర్ణయించారు.  టెట్‌కు కనీసం రెండు లక్షల మంది పోటీపడే అవకాశం ఉంది. గత జనవరిలో జరిగిన 2024 టెట్‌-2 పరీక్షకు 2,75,753 మంది దరఖాస్తు చేసి... 2,05,278 మంది పరీక్ష రాశారు. వారిలో 83,711 మంది కనీస మార్కులు సాధించి డీఎస్సీకి అర్హత పొందారు. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఓసీలకు-90, బీసీ-75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. 

ఇదీ షెడ్యూల్‌

  • నోటిఫికేషన్‌ జారీ: ఏప్రిల్‌ 11
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ: 15 నుంచి 30 వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: జూన్‌ 9 నుంచి
  • ఆన్‌లైన్‌ పరీక్షల తేదీలు: జూన్‌ 15-30 మధ్య
  • పరీక్షల సమయం: ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు (రోజుకు రెండు విడతలు)
  • ఫలితాల వెల్లడి: జులై 22న