JEE Advanced 2026| జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సిలబస్ విడుదల.. 19 ఏళ్ల పాత ప్రశ్నపత్రాలివిగో!
జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026)పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.
By Education News Team
Updated :14 Dec 2025 15:41 IST
https://results.eenadu.net/news.aspx?newsid=14122025-JEE-Advanced-2026
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026)పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 17న జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5న ఈ పరీక్షకు సంబంధించిన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఐఐటీ రూర్కీ అధికారులు.. తాజాగా పరీక్ష సిలబస్‌ను విడుదల చేశారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పలు కాన్సెప్టులను కవర్ చేసేలా సిలబస్ రూపొందించారు. వీటితో పాటు అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి 19 ఏళ్ల (2007 నుంచి 2025 వరకు) పాత ప్రశ్నపత్రాలను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్ కోసం క్లిక్ చేయండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ పాత ప్రశ్నపత్రాలు