CSIR UGC NET 2024 Result | సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (జులై) ఫలితాలు విడుదల
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద లింక్‌పై క్లిక్ చేసి స్కోరు కార్డు పొందొచ్చు.
Published :13 Sep 2024 16:13 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13092024
CSIR UGC NET 2024 results| దిల్లీ: దేశవ్యాప్తంగా సైన్స్, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్ అండ్ లెక్చర్‌షిప్/అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హతకు నిర్వహించిన జాయింట్ సీఎస్‌ఐఆర్-యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ ఫలితాలను విడుదల చేసింది. ఇప్పటికే ప్రిలిమినరీ, తుది కీలను విడుదల చేసి.. అభ్యంతరాలు స్వీకరించిన ఎన్‌టీఏ అధికారులు తాజాగా ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 187 నగరాల్లో 348 కేంద్రాల్లో జులై 25 నుంచి 27 తేదీల్లో కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించిన ఈ పరీక్షలకు 1,63,529 మంది హాజరయ్యారు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి