JEE Advanced Admit cards | జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

JEE Advanced Admit cards | జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published :12 May 2025 10:38 IST
ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 పరీక్షకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అడ్మిట్‌ కార్డులను విడుదల చేశారు. మే 18న రెండు పేపర్లు (ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌- 1 ; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌- 2)గా జరిగే JEE Advanced అడ్మిట్‌ కార్డులను ఐఐటీ కాన్పుర్‌ డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ, ఇతర వివరాలు ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్‌ సాధించిన రెండున్నర లక్షలమందికి పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.

అడ్మిట్ కార్డులు కోసం క్లిక్ చేయండి