AP EAPCET Results: ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో.. టాప్- 10 ర్యాంకర్లు వీళ్లే..
ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల్లో టాప్ -10 ర్యాంకులతో సత్తా చాటిన విద్యార్థులు వీరే..
Published : 11 June 2024 17:25 IST
https://results.eenadu.net/news.aspx?newsid=11062024
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) వచ్చేశాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు. ఈ పరీక్షకు 3.62 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 3.39 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థులు (75.51శాతం) అర్హత సాధించగా, అగ్రికల్చర్ విభాగంలో 70,352 మంది (87.11శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. పలువురు విద్యార్థులు అసాధారణ ప్రతిభతో టాప్- 10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటారు. వీరిలో పలువురు తెలంగాణ విద్యార్థులు ఉండటం విశేషం.
ఇంజినీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు వీళ్లే..
- మాకినేని జిష్ణు సాయి (గుంటూరు జిల్లా)
- మురసాని సాయి యశ్వంత్ రెడ్డి (కర్నూలు)
- బోగాలపల్లి సందేశ్ (ఆదోని)
- పాలగిరి సతీశ్ రెడ్డి( బుక్కరాయసముద్రం-అనంతపురం)
- కోమటినేని మనీశ్ చౌదరి (గుంటూరు)
- యప్పా లక్ష్మీనరసింహారెడ్డి (సిద్దిపేట-తెలంగాణ)
- గొల్ల లేఖాహర్ష (కర్నూలు)
- పుట్టి కుశాల్ కుమార్ (అనంతపురం)
- పరమారాధ్యుల సుశాంత్ (హనుమకొండ-తెలంగాణ)
- కొమిరిశెట్టి ప్రభాస్ (అక్కపాలెం-ప్రకాశం)
అగ్రికల్చర్ విభాగంలో టాప్ 10 ర్యాంకర్లు..
- ఎల్లు శ్రీశాంత్ రెడ్డి (హైదరాబాద్)
- పూల దివ్యతేజ (తలుపుల -సత్యసాయి)
- వడ్లపూడి ముఖేశ్ చౌదరి (తిరుపతి)
- పేరా సాత్విక్ (పులిచెర్ల-చిత్తూరు)
- ఆలూరు ప్రణీత (మదనపల్లె-అన్నమయ్య)
- గట్టు భానుతేజ సాయి ((పాపంపేట- అనంతపురం))
- పెన్నమాడ నిహారిక రెడ్డి (హైదరాబాద్)
- శంబంగి మనో అభిరామ్ (గాజువాక-విశాఖ)
- శరగడం పావని (గాజువాక-విశాఖ)
- నాగుదాసరి రాధాకృష్ణ (పార్వతీపురం-మన్యం)