TGPSC Group-2 Top 10 Rankers | తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే..
లక్షలాది మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్- 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి టాప్ 10 ర్యాంకుల్లో నిలిచిన అభ్యర్థులు వీరే..
By Education News Team
Published :11 Mar 2025 16:10 IST
https://results.eenadu.net/news.aspx?newsid=11032025-tgpsc-group-2-top-10-rankers
TGPSC Group-2 Top Rankers | ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ గ్రూప్ -2 పరీక్ష ఫలితాల్లో (Telangana Group 2 Results) పలువురు విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 600 మార్కులకు పరీక్షలు జరగ్గా.. నారు వెంకట హరవర్ధన్ అనే విద్యార్థి 447.088 మార్కులతో తొలి ర్యాంకుతో మెరవగా.. వడ్లకొండ సచిన్ రెండో ర్యాంకు, బి. మనోహర్ రావు మూడో ర్యాంకులతో సత్తా చాటారు. టాప్- 31 ర్యాంకుల్లో అందరూ అబ్బాయిలే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో 783 గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ.. మంగళవారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే.
టాప్ -10 ర్యాంకర్ల జాబితా ఇదే..
1. నారు వెంకట హరవర్ధన్ (447.088 మార్కులు)
2. వడ్లకొండ సచిన్ (444.754 మార్కులు)
3. బి మనోహర్‌రావు (439.344 మార్కులు)
4. శ్రీరామ్ మధు (438.972 మార్కులు)
5. చింతపల్లి ప్రీతమ్ రెడ్డి (431.102 మార్కులు)
6. అఖిల్ ఎర్రా (430.807 మార్కులు)
7. గొడ్డేటి అశోక్ (425.842 మార్కులు)
8. చిమ్ముల రాజశేఖర్ ( 423.933 మార్కులు)
9. మేకల ఉపేందర్ (423.119 మార్కులు)
10. కరింగు నరేష్ (422.989 మార్కులు)