TGPSC Group-2 Results | తెలంగాణ గ్రూప్ -2 ఫలితాలు వచ్చేశాయ్
లక్షలాది మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్- 2 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :11 Mar 2025 15:12 IST
https://results.eenadu.net/news.aspx?newsid=11032025-TGPSC-Group-2-Results
TGPSC Group-2 Results | ఇంటర్నెట్ డెస్క్: లక్షలాది మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్ -2 పరీక్షల ఫలితాలు (Telangana Group 2 Exam Results) విడుదలయ్యాయి. గతేడాది డిసెంబర్‌లో నిర్వహించిన ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులతో పాటు జనరల్ ర్యాంకుల జాబితాను టీజీపీఎస్సీ(TGPSC) ప్రకటించింది. అలాగే, తుది కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లతో పాటు ఓఎంఆర్ షీట్లను డౌన్‌లోడ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
జనరల్ ర్యాంకింగ్ జాబితా కోసం క్లిక్ చేయండి
రాష్ట్రంలో 783 గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షకు 5,51,943మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించగా.. 2,49,964మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో 13,315మందిని ఇన్‌వ్యాలిడేటెడ్‌గా ప్రకటించి.. తాజాగా 2,36,649మంది అభ్యర్థులతో జనరల్ ర్యాంకింగ్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఫైనల్ కీ, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను మార్చి 11 నుంచి ఏప్రిల్ 9వరకు అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్లను వ్యక్తిగత లాగిన్‌లలో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీ ఆధారంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మాస్టర్ క్వశ్చన్‌పేపర్లు, ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి
జనరల్ ర్యాంకింగ్స్ ఆధారంగా తగిన సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేస్తారు. వారికి వ్యక్తిగతంగా, టీజీపీఎస్సీ వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందిస్తారు. అందువల్ల అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో పేర్కొన్న ప్రకారం.. అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్‌లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఏవైనా సాంకతికపరమైన సమస్యలు తలెత్తితే.. టీజీపీఎస్సీ హెల్ప్‌డెస్క్ ఫోన్ నంబర్లు: 040-23542185/040-23542187 లేదా helpdesk@tspsc.gov.inకు ఈ-మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.
ఓఎంఆర్ షీట్స్ డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి