JEE Advanced Results : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

JEE Advanced Results : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వచ్చేశాయ్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు.

Published : 09 June 2024 09:45 IST

దిల్లీ: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెల 26న జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన ఐఐటీ మద్రాస్‌.. తాజాగా తుది కీ, JEE Advanced Resultsను ప్రకటించింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించిన ఈ పరీక్షను దాదాపు 2 లక్షల మంది రాయగా.. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది వున్నారు. బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్తంగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 10 నుంచి జులై 23 వరకు కొనసాగనుంది.