TG TET 2024-25 : తెలంగాణ టెట్‌ దరఖాస్తులు మొదలయ్యాయ్‌.. పూర్తి వివరాలివే..

TG TET 2024-25 : తెలంగాణ టెట్‌ దరఖాస్తులు మొదలయ్యాయ్‌.. పూర్తి వివరాలివే..

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Published :08 Nov 2024 15:02 IST

TG TET 2024-25| హైదరాబాద్‌: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024-25)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 20వరకు ఆన్‌లైన్‌ https://tgtet2024.aptonline.in/tgtet/లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ ఆధారిత  టెట్‌ పరీక్ష  జనవరి 1 నుంచి 20తేదీల మధ్య నిర్వహిస్తారు. మొదటి సెషన్‌ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు; సెకెండ్‌ సెషన్‌ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు జరగనున్నాయి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు టెట్‌ 2024-25కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి.

ఫేక్‌ జాబ్‌ అలర్ట్‌! నకిలీ ఉద్యోగ ఆఫర్లను గుర్తించడమెలా?

దరఖాస్తు ఫీజు తగ్గింపు

గత టెట్‌ దరఖాస్తు ఫీజు రూ.400 నుంచి రూ.1000కి పెంచడంతో అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే.  దీంతో ఈసారి అప్లికేషన్‌ ఫీజును తగ్గించారు. గతంలో ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు రూ.2వేలు ఫీజు ఉండగా.. ప్రస్తుతం ఒక పేపర్‌కు ₹750, రెండు పేపర్లు రాసిన వారికి రూ.1000కి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫీజు పేమెంట్ కోసం క్లిక్‌ చేయండి. టెట్‌ పేపర్‌-1 రాసేందుకు డీఈడీ, పేపర్‌-2 రాసేందుకు డిగ్రీ, బీఈడీ పూర్తి చేసి ఉండాలి. సర్వీస్‌ టీచర్లు సైతం టెట్‌ రాయొచ్చు. ఈ పరీక్షకు విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లోని బుక్‌లెట్‌లో తెలుసుకోవచ్చు. పేమెంట్ స్టేటస్‌ (TG TET Payment status link) తెలుసుకునేందుకు క్లిక్‌ చేయండి.

ముఖ్యాంశాలివే.. 

  • టెట్‌లో రెండు పేపర్లుంటాయి. పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
  • ప్రాథమిక పాఠశాలల్లోని సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్‌జీటీ) ఉద్యోగాలకు అర్హత పొందేందుకు పేపర్‌-1, ఉన్నత పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ) ఉద్యోగాలకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు. 
  • పేపర్‌-2లో మళ్లీ గణితం, సైన్స్‌; సాంఘికశాస్త్రం రెండు వేర్వేరు పేపర్లు ఉంటాయి. 
  • ఒకసారి పాసైతే ఆ స్కోర్‌కు జీవితకాలం గుర్తింపు ఉంటుంది.
  • టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20% వెయిటేజీ ఇస్తారు. అందుకోసమే మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు మళ్లీ మళ్లీ పరీక్ష రాస్తుంటారు. 

టీనేజర్లలో ఈ నైపుణ్యాలుంటే.. తిరుగులేని కెరీర్‌!

పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ: నవంబర్‌ 7 నుంచి 20వరకు
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: డిసెంబర్‌ 26 నుంచి
  • పరీక్ష తేదీలు: జనవరి 1 నుంచి 20 మధ్య
  • ఫలితాలు: ఫిబ్రవరి 5న