TGPSC Group 3 Key I తెలంగాణ గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీ విడుదల

TGPSC Group 3 Key I తెలంగాణ గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీ విడుదల

తెలంగాణ గ్రూప్‌ 3 పరీక్ష ప్రిలిమినరీ కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను టీజీపీఎస్సీ అందుబాటులో ఉంచింది.

Eenadu icon
By Education News Team Published : 08 Jan 2024 18:39 IST

TGPSC Group 3 Key | ఇంటర్నెట్‌ డెస్క్‌: రాష్ట్రంలో 1,365 ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించిన గ్రూప్‌ -3 పరీక్ష ప్రిలిమినరీ కీని టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది.  అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.  మొత్తం మూడు పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా..  2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లలో పరీక్ష కీ, మాస్టర్‌ క్వశ్చన్‌ పేపర్లను అందుబాటులో ఉంచింది. 

ప్రిలిమినరీ కీ కోసం క్లిక్ చేయండి

గ్రూప్‌ 3 ప్రిలిమినరీ కీపై జనవరి 12 సాయంత్రం 5గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం ఇంగ్లిష్‌లోనే అభ్యంతరాలను తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ-మెయిల్‌, వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించడాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టంచేశారు.