GATE 2025 Admit Cards | గేట్ 2025 పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
గేట్ 2025 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి.
By Education News Team
Published : 07 Jan 2024 14:53 IST
https://results.eenadu.net/news.aspx?newsid=07012025
GATE 2025 Admit Cards| రూర్కీ: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాల కోసం గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) పరీక్షకు ఐఐటీ రూర్కీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష కోసం అక్టోబర్ 3వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈమెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ తదితర వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ (GATE2025 Admit Cards Download) చేసుకోవచ్చు.
గేట్ 2025 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి