RRB ALP 2024 Key | అసిస్టెంట్ లోకోపైలట్ సీబీటీ-1 కీ విడుదల.. అభ్యంతరాల కోసం క్లిక్ చేయండి
దేశ వ్యాప్తంగా పలు రైల్వే బోర్డుల పరిధిలో నిర్వహించిన అసిస్టెంట్ లోకో పైలట్ నియామక రాత పరీక్ష (Assistant Loco Pilot Exam) సీబీటీ-1 కీ విడులైంది.
Published :05 Dec 2024 17:28 IST
https://results.eenadu.net/news.aspx?newsid=051224
ALP exam 2024 Key| ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా పలు రైల్వే బోర్డుల పరిధిలో నిర్వహించిన అసిస్టెంట్ లోకో పైలట్ నియామక రాత పరీక్ష (Assistant Loco Pilot Exam) సీబీటీ-1 కీ విడులైంది. అభ్యర్థులు తమ ప్రొవిజినల్ ఆన్సర్ కీతో పాటు క్వశ్చన్‌పేపర్లు డౌన్‌లోడ్ చేసుకొని అభ్యంతరాలను తెలిపేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) అవకాశం కల్పించింది. ఈ ఆన్సర్ కీ లింక్ డిసెంబర్ 10వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి కీ పొందొచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్‌డెస్క్ నంబర్ 9513437783ను సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
కీ కోసం క్లిక్ చేయండి
మొత్తం 18,799 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగ నియామక పరీక్షను ఆర్‌ఆర్‌బీ ఐదు దశల్లో నిర్వహిస్తోంది. సీబీటీ 1, సీబీటీ 2, కంప్యూటర్‌బేస్డ్ ఆప్టిట్యూడ్ డెస్ట్ (సీబీఏటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి 29వరకు తొలి దశలో సీబీటీ- 1 జరిగింది. డిసెంబర్ 5న కీ విడుదల చేసిన అధికారులు డిసెంబర్ 10వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
ఆర్‌ఆర్‌బీ విడుదల చేసిన ఈ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఒక్కో ప్రశ్నకు రూ. 50 రుసుంతో పాటు బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వారు లేవనెత్తిన అభ్యంతరాలు సరైనవైతే.. ఆ బ్యాంకు సర్వీస్ ఛార్జీ మినహాయించి మిగతా మొత్తాన్ని సదరు అభ్యర్థులకే రిఫండ్ చేస్తారు.