Sleeping I పనివేళల్లో నిద్ర వస్తోందా? చెక్‌ పెట్టండిలా!

Sleeping I పనివేళల్లో నిద్ర వస్తోందా? చెక్‌ పెట్టండిలా!

పని వేళల్లోనో, మధ్యాహ్నం సమయంలో సీరియస్‌గా చదువుతున్నప్పుడు నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్‌ ఇవిగో..

Published :05 Dec 2024 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యాహ్నం వేళల్లో పని(Work) చేస్తున్నప్పుడో, సీరియస్‌గా పరీక్షలకు ప్రిపేర్‌(Exams Preparation) అవుతున్నప్పుడో నిద్ర వస్తే ఎంత చిరాకుగా ఉంటుందో కదా! మధ్యాహ్న భోజనం తర్వాత శరీరం పనిచేసేందుకు ఏమాత్రం సహకరించదు. దీంతో ఏ పనిమీదా దృష్టి పెట్టలేం. ఇది మామూలుగా ఉండే సమస్యే.. కానీ, రోజంతా ఇలాగే ఉంటే వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ (Work Life balance) కుదరదు. అందువల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని టిప్స్‌ ఇవిగో! 

డిన్నర్‌ ఆలస్యం చేయొద్దు

రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేయడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన 3 నుంచి 4 గంటల  తరవాత  నిద్రకు ఉపక్రమించాలి. వీలైనంత తొందరగా రాత్రి భోజనం చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఏ ఆహారం అయినా సరే..  లేట్‌ నైట్స్‌ తినొద్దు. 

స్క్రీన్‌ టైమ్‌ చెక్‌ చేసుకోండి

ప్రస్తుతం ఎలక్ట్రానిక్‌ పరికరాలతో మనిషి జీవితం వీడదీయరానిదిగా మారింది. ఎక్కువ సమయం ఫోన్‌తోనే గడుపుతూ అవసరానికి మించి స్క్రీన్‌లకు అతుక్కుపోతున్నారు. తక్కువ వెలుతురులో ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. సాధ్యమైనంత  వరకు ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం భోజన సమయానికి ముందు వరకు పరిమితం చేసుకునేలా జాగ్రత్త వహించండి. 

వర్క్‌- లైఫ్‌ బ్యాలెన్స్‌కు 7 చిట్కాలివిగో!

నిద్రలో రెగ్యులారిటీ ఉందా?

మంచి నిద్ర కావాలంటే చుట్టూ ఉండే వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్‌ చేసుకోండి. పడుకునే ముందు గదిలోకి ఎక్కువ వెలుతురు లేకుండా చూసుకోగలిగితే.. నిద్ర బాగా పడుతుంది. రోజూ కచ్చితంగా 6 నుంచి 8 గంటల సమయం వరకూ నిద్రపోతే.. చిరాకు, అలసట, నీరసం దరి చేరవు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 

రాత్రి వేళల్లో టీ, కాఫీలు తాగొద్దు

కాఫీ, టీల్లో ఉండే కెఫిన్‌ నిద్రను దూరం చేస్తుంది. రాత్రి సమయంలో వీటిని తాగడం వల్ల నిద్ర రాదు. భోజనం తర్వాత కాఫీ, టీలు తాగకూడదు. రాత్రి పడుకునే ముందు పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి.

ఆల్కహాల్‌కు దూరమైతే ఆరోగ్యం

ఆల్కహాల్‌ తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి శరీర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో ఏ పనినీ సంపూర్ణంగా చేయలేరు. ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు.  పసుపు కలిపిన పాలను నిద్రపోయే ముందు తాగితే హాయిగా నిద్రపడుతుంది.