AP TET Results I ఏపీ టెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
ఏపీ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద పేర్కొన్న లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా అభ్యర్థులు ఫలితాలు పొందొచ్చు.
Published :04 Nov 2024 11:37 IST
https://results.eenadu.net/news.aspx?newsid=04112024
టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
AP TET Results | అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21వ వరకు టెట్ పరీక్షలు (AP TET Exam) జరగ్గా.. ప్రాథమిక కీ, రెస్పాన్స్‌షీట్‌లను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం అక్టోబర్ 29న తుది కీ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫలితాలను(AP TET Results) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఏపీ టెట్ ఫైనల్ కీ విడుదల.. సబ్జెక్టుల వారీగా KEY కోసం క్లిక్ చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా టెట్‌కు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 1,87,256 (50.79 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన వారికి మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డెస్క్ నంబర్లకు కాల్ చేయవచ్చని అధికారులు సూచించారు.
హెల్ప్ డెస్క్ నంబర్లు
9398810958,
6281704160,
8121947387,
8125046997,
9398822554