AP SSC Halltickets I వాట్సప్‌లో ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ ఇలా!

AP SSC Hall tickets I వాట్సప్‌లో ఏపీ పదో తరగతి హాల్‌టికెట్లు.. డౌన్‌లోడ్‌ ఇలా!

ఏపీలో మార్చి 17 నుంచి జరగనున్న పదోతరగతి పరీక్షల హాల్‌టికెట్లు (AP SSC Hall tickets) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Published :04 Mar 2025 15:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏపీలో మార్చి 17 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు (AP SSC Hall tickets) విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను నేరుగా వాట్సప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. హాల్‌టికెట్లను మనమిత్ర (వాట్సప్‌ నంబరు 9552300009)తో పాటు అధికారిక వెబ్‌సైట్‌ https://www.bse.ap.gov.in/ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరుతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మందికి పైగా పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.

వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ ఇలా..

  • మీ ఫోన్‌లో 95523 00009 నంబర్‌ను సేవ్‌ చేసుకోండి
  • అందులో Hi అని మెసేజ్‌ పంపండి
  • సర్వీస్‌ సెలక్షన్‌ అనే ఆప్షన్‌ వస్తుంది
  • ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ను ఎంచుకోండి
  • అక్కడ ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోండి 
  • అప్లికేషన్‌ నంబర్‌/చైల్డ్‌ ఐడీతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాలి
  • రెగ్యులర్‌/ప్రైవేటు/ఓఎస్ఎస్‌సీ రెగ్యులర్‌/ఒకేషనల్‌లలో మీకు సంబంధించిన కేటగిరీని ఎంచుకొని కన్‌ఫర్మ్‌ చేయండి.
  • ఆ తర్వాత కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్‌ మీ వాట్సప్‌ నంబర్‌కే వచ్చేస్తుంది. 
  • డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ తీసుకోండి.