సీఏ ఇంటర్ ఫలితాలు.. టాపర్‌గా హైదరాబాద్ అమ్మాయి
ICAI CA Inter Results 2025: సీఏ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ అమ్మాయి టాపర్‌గా నిలిచింది.
By Education News Team
Published :04 Mar 2025 12:49 IST
https://results.eenadu.net/news.aspx?newsid=04032025
దిల్లీ: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) సీఏ ఇంటర్, ఫౌండేషన్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. జనవరిలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ICAI మంగళవారం విడుదల చేసింది. విద్యార్థులు
https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో తమ రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ వంటి వివరాలను ఎంటర్ చేసి స్కోరు కార్డులు, మెరిట్ జాబితాలను పొందొచ్చు.
ఇక, సీఏ ఇంటర్ (ICAI CA Inter Results 2025) పరీక్ష ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్ 86.63శాతం మార్కులతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. విజయవాడకు చెందిన తోట సోమనాధ్ శేషాద్రి నాయుడు 86శాతం స్కోరుతో రెండో ర్యాంక్ దక్కించుకున్నాడు. హాథ్రస్ (యూపీ)కి చెందిన సర్థాక్ అగర్వాల్ 85.83శాతం మార్కులతో మూడో ర్యాంక్‌లో నిలిచాడు.
సీఏ ఇంటర్ గ్రూప్ 1 పరీక్షల్లో 14.17శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 1,08,187 మంది పరీక్ష రాయగా.. 15,332 మంది పాసయ్యారు. గ్రూప్ 2 పరీక్షలో 22.16శాతం, రెండు గ్రూప్‌ల విభాగంలో 14.05శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఫౌండేషన్ పరీక్షలో 21.52శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ కోర్సులో గ్రూపు-1 పరీక్షలు జనవరి 11, 13, 15 తేదీల్లో; గ్రూపు-2ను జనవరి 17, 19, 21 తేదీల్లో ICAI నిర్వహించింది. రెండు గ్రూప్‌ల వారికి జనవరి 12, 14, 16, 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి.