TS SET 2024 Admit cards | టీఎస్‌ సెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

TS SET 2024 Admit cards | టీఎస్‌ సెట్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా..

తెలంగాణలో టీఎస్‌ సెట్‌ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Published :03 Sep 2024 22:05 IST

TS SET Admit Cards| హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష ఫలితాలు (TS SET 2024) అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో లెక్చరర్‌షిప్‌ పొందాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ధారించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది. సెప్టెంబర్‌ 10 నుంచి 13వరకు జరిగే ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డును ఈ లింక్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

ఐఐటీ బాంబే: 1,475 మందికి జాబ్‌ ఆఫర్లు.. 22 మందికి ₹కోటికి పైనే ప్యాకేజీ

తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం టీజీ సెట్‌ పరీక్ష ఆగస్టు 28 నుంచి 31వరకు జరగాల్సి ఉండగా.. యూజీసీ నెట్‌ పరీక్షల కారణంగా సెప్టెంబర్‌ 10 నుంచి 13వరకు రీషెడ్యూల్‌ చేశారు.