CBSE Board Exams 2026 | సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలకు సిద్ధమేనా? ఇవి చెక్‌ చేసుకోండి!

CBSE Board Exams 2026 | సీబీఎస్‌ఈ 10, 12 పరీక్షలకు సిద్ధమేనా? ఇవి చెక్‌ చేసుకోండి!

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు (CBSE Board Exams 2026) రంగం సిద్ధమైంది.

Eenadu icon
By Education News Team Updated :09 Feb 2026 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలకు (CBSE Board Exams 2026) రంగం సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన అధికారులు.. పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల సన్నద్ధతలో బిజీగా ఉన్న విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు ఆఖరి నిమిషంలో తలెత్తే ఇబ్బందుల్ని నివారించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలివిగో!

అడ్మిట్‌ కార్డులో ఈ వివరాలు చెక్‌ చేసుకోండి..

  • పరీక్షల ముందు అడ్మిట్‌ కార్డులో రోల్‌ నంబర్‌
  • పుట్టిన తేదీ (టెన్త్‌ విద్యార్థులైతే)
  • పరీక్ష పేరు, అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి/ సంరక్షుడి పేరు
  • ఎగ్జామ్ సెంటర్ పేరు
  • అడ్మిట్‌ కార్డు ఐడీ
  • వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలు తదితర వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి.

మరికొన్ని ప్రత్యేక సూచనలు

  • మీ పరీక్ష కేంద్రం ఎక్కడో కనీసం పరీక్షకు ముందు రోజు వెళ్లి చూసుకొని రావడం ఉత్తమం. తద్వారా పరీక్ష రోజు తగిన సమయానికి చేరుకొనేలా ఇబ్బంది లేకుండా ఉంటుంది.
  • ఉదయం 10 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అందువల్ల ముందుగానే పరీక్ష కేంద్రం వద్దకు చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. 
  • విద్యార్థులు తమ పాఠశాల యూనిఫాంలోనే పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. 
  • పాఠశాల ఐడీ కార్డుతో పాటు సీబీఎస్‌ఈ జారీ చేసిన అడ్మిట్‌ కార్డును తీసుకెళ్లడం తప్పనిసరి.
  • అలాగే, ఈ పరీక్షల్లో అనుమతించిన కొన్ని స్టేషనరీ వస్తువులను తీసుకెళ్లొచ్చు. 
  • మొబైల్‌ ఫోన్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు, ఇతర నిషేదిత వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
  • అడ్మిట్‌ కార్డులో ఇచ్చిన ప్రతి నిబంధననూ కచ్చితంగా  చదవడంతో పాటు వాటిని పాటించాలి.
  • పరీక్షల్లో ఏవైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని గుర్తుంచుకోవాలి.