Kabir Chhillar | ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్‌ టాపర్‌ కబీర్‌ చిల్లర్‌

Kabir Chhillar | ‘ఎంతసేపు చదివామన్నది కాదు’: జేఈఈ మెయిన్‌ టాపర్‌ కబీర్‌ చిల్లర్‌

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో రాజస్థాన్‌ నుంచి 17 ఏళ్ల కబీర్‌ (Kabir Chhillar) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

Eenadu icon
By Education News Team Updated : 17 Feb 2026 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 ఫలితాల్లో (JEE Main 2026 Results) రాజస్థాన్‌ నుంచి 17 ఏళ్ల కబీర్‌ (Kabir Chhillar) అత్యుత్తమ ప్రదర్శన  కనబరిచాడు. జేఈఈ మెయిన్‌లో 300కు 300 స్కోర్‌ సాధించాడు. టాప్ స్కోర్‌ సాధించడంపై కబీర్‌ మీడియాతో మాట్లాడుతూ.. పట్టుదల, నిరంతర శ్రమ వల్లే తాను మెయిన్‌ ఫలితాల్లో మంచి మార్కులు సాధించినట్లు తెలిపారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడం తన లక్ష్యమన్నారు. కేంబ్రిడ్జ్‌లోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్నట్లు తెలిపాడు. కోటాలో శిక్షణ తీసుకోవడం కూడా తనకు బాగా ఉపయోగపడిందన్నారు. జేఈఈలో మంచి మార్కులు సాధించడానికి ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంపై తోటి విద్యార్థులకు పలు సూచనలు చేశాడు. అవేంటంటే?

  • జేఈఈలో మంచి మార్కులు సాధించాలంటే నిరంతర కృషితో పాటు పరీక్షలకు సన్నద్ధమవ్వడానికి సరైన పద్ధతిని అనుసరించడం అవసరం.
  • ఎక్కువ గంటలు చదవడానికి బదులు సబ్జెక్ట్‌లోని అంశాలను అర్థం చేసుకోవాలి.
  • వాటిని చిన్న చిన్న టాపిక్‌లుగా విడగొట్టి.. సమగ్రంగా అధ్యయనం చేయడం వల్ల ప్రతి అంశంపైనా పట్టు సాధించగలం.
  • మనం ఏం చదువుతున్నామనే విషయాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. పరీక్షల్లో చేసిన తప్పుల వల్ల నిరుత్సాహపడకుండా వాటి నుంచి పాఠం నేర్చుకోవాలి.
  • ప్రతి పరీక్ష తర్వాత ఎక్కడ తప్పు చేశాం, ఎందులో వెనకబడి ఉన్నాం అనే విషయాలను సమీక్షించుకోవాలి. 
  • మాక్ టెస్ట్‌లు రాయాలి. దీనివల్ల పరీక్షల సమయంలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుస్తుంది.