Agniveer Jobs | అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు షురూ

Agniveer Jobs | అగ్నివీర్‌ పోస్టులకు దరఖాస్తులు షురూ

భారత సైన్యంలో అగ్నివీర్‌ పోస్టుల (2026-27 సంవత్సరానికి) భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.

Eenadu icon
By Education News Team Published :16 Feb 2026 21:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత సైన్యంలో అగ్నివీర్‌ పోస్టుల (2026-27 సంవత్సరానికి) భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అగ్నివీర్‌ల ఎంపిక కోసం అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 13న ప్రారంభమైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్‌ 1వ తేదీ వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 1 నుంచి 15వరకు జరిగే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటిస్తారు. ఈ ఉద్యోగాల్లో చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్‌ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశ వ్యాప్తంగా అగ్నివీర్‌ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మన్, సోల్జర్ ఫార్మా, నర్సింగ్ అసిస్టెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ వంటి అనేక విభాగాల్లో దాదాపు 25వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైంది. ఆయా పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్‌ అర్హతలు కలిగి ఉండాలి. ఎన్‌సీసీ సర్టిఫికేట్‌ ఉన్నవారికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు, ఐటీఐ లేదా స్కిల్‌ ఇండియా కోర్సులు చేసిన వారికి బోనస్‌ మార్కులు వర్తిస్తాయి. వయో పరిమితి, జీత భత్యాలు, ఇతర ప్రయోజనాలు తదితర పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.