cmat 2026 results | సీమ్యాట్ ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ఫలితాలు (CMAT 2026 Results) విడుదలయ్యాయి.
By Education News Team
Updated : 17 Feb 2026 21:11 IST
https://results.eenadu.net/education-news/cmat-2026-results-out
ఇంటర్నెట్ డెస్క్: మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్) ఫలితాలు (CMAT 2026 Results) విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా జనవరి 25న ఈ పరీక్ష జరగ్గా 41,872 మంది (78.33%) మంది హాజరయ్యారు. ఇటీవల ప్రిలిమినరీ కీ విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన ఎన్‌టీఏ (NTA) అధికారులు.. ఈ ఉదయం ఫైనల్ కీని విడుదల చేసి తాజాగా ఫలితాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి స్కోర్ కార్డును పొందొచ్చు.
స్కోర్ కార్డు కోసం క్లిక్ చేయండి
దేశంలోని ఏఐసీటీఈ ఆమోదించిన విద్యాసంస్థలు/యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 25న సీమ్యాట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 53,453 మంది దరఖాస్తు చేసుకోగా, 41,872 మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో సాధించిన స్కోరు ఆధారంగా ఆయా విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.