jee main 2026 Topper | తాతయ్యను చూసి.. ఇంజినీర్ కావాలనుకున్నాడు: మోహిత్ తల్లిదండ్రులు
జేఈఈ మెయిన్ ఫలితాల్లో కడప జిల్లాకు చెందిన పసల మోహిత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో 300/300 మార్కులు సాధించడంపై అతడి తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేశారు.
By Education News Team
Updated :16 Feb 2026 20:46 IST
https://results.eenadu.net/education-news/jee-main-topper-mohith-parents-reaction
జమ్మలమడుగు: జేఈఈ మెయిన్ ఫలితాల్లో (JEE Main 2026 Results) కడప జిల్లాకు చెందిన పసల మోహిత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో 300/300 మార్కులు సాధించడంపై అతడి తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘‘మోహిత్ బాగా చదువుతాడని తెలుసు. కానీ 100 పర్సంటైల్ స్కోరు సాధిస్తాడని మేం అనుకోలేదు. ఎంతో గర్వంగా ఉంది. ఏడో తరగతి వరకు జమ్మలమడుగులో, 8వ తరగతి నంద్యాలలో, 9, 10 తరగతులు గుడివాడలో, ఇంటర్ శ్రీచైతన్య కళాశాలలో చదివాడు’’
‘‘తన తాతయ్యను చూసి ఇంజినీర్ కావాలని మోహిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. మేం కూడా బలవంత పెట్టలేదు. అలాగని, వద్దనీ చెప్పలేదు. పదో తరగతి పూర్తయ్యాక శ్రీచైతన్యలో చేరతానని చెప్పాడు.. జేఈఈ మెయిన్ ఫలితాల్లో 300/300 మార్కులు తెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’’ అని మోహిత్ తండ్రి అన్నారు. తన కుమారుడికి ఐఐటీ బాంబేలో సీటు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.