JEE Main 2026 | జేఈఈ మెయిన్ పేపర్-2 ప్రొవిజినల్ కీ విడుదల
జేఈఈ మెయిన్ (సెషన్-1) పేపర్-1 ఫలితాలను ఇటీవల ప్రకటించిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా పేపర్-2 ప్రొవిజినల్ ఆన్సర్ కీని విడుదల చేశారు.
By Education News Team
Updated :19 Feb 2026 20:24 IST
https://results.eenadu.net/education-news/JEE-Main-2026-Provisional-key-released
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (సెషన్-1) పేపర్-1 ఫలితాలను ఇటీవల ప్రకటించిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా పేపర్-2 ప్రొవిజినల్ ఆన్సర్ కీ(JEE Main Paper 2 Provisional Answer Key)ని విడుదల చేశారు. దేశంలోని ఎన్‌ఐటీల్లో బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జనవరి 29న జేఈఈ మెయిన్ పేపర్ -2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ప్రొవిజినల్ ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లను గురువారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దీనిపై ఫిబ్రవరి 19 నుంచి 20వ తేదీ రాత్రి 11.50గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యంతరాలు లేవనెత్తేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 (నాన్ రిఫండ్) చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీ, ఫలితాలను వెల్లడించనున్నారు.
ప్రొవిజినల్ ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి