TGPSC Group-1 Marks Memo | తెలంగాణ గ్రూప్- 1 అభ్యర్థుల మార్కుల జాబితా ఇదిగో.. మెమోల డౌన్‌లోడ్ ఇలా!
తెలంగాణలో గ్రూప్- 1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కుల్ని ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ(TGPSC).. తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితా(TGPSC Group 1 General rankings list) విడుదల చేసింది.
By Education News Team
Published :30 Mar 2025 15:19 IST
https://results.eenadu.net/news.aspx?newsid=tgpsc-group-1-mark-memo
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో గ్రూప్- 1 మెయిన్స్ ప్రొవిజినల్ మార్కుల్ని ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ(TGPSC).. తాజాగా జనరల్ ర్యాంకింగ్ జాబితా(TGPSC Group 1 General rankings list) విడుదల చేసింది. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్‌తో పాటు మెయిన్స్ పరీక్ష మార్కుల మెమోలను డౌన్‌లోడ్ కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అలాగే, అభ్యర్థులు రాసిన క్వాలిఫైయింగ్ టెస్ట్(ఇంగ్లిష్)తో పాటు మిగతా ఆరు పేపర్లలో సాధించిన మొత్తం మార్కులతో కూడిన మరో జాబితాను ప్రత్యేకంగా విడుదల చేసింది. తెలంగాణలో 563 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించగా 21,093మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.
మెయిన్స్‌లో మార్కుల జాబితా కోసం క్లిక్ చేయండి
ప్రొవిజినల్ మార్కుల జాబితాను మార్చి 10 నుంచి మార్చి 16న సాయంత్రం 5గంటల వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచిన టీజీపీఎస్సీ.. మార్కుల రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు మార్చి 24వ తేదీ వరకు అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అభ్యర్థులు ఏడు పేపర్లలో సాధించిన మొత్తం మార్కుల వివరాలతో పాటు జనరల్ ర్యాంకింగ్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మార్కుల మెమోలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అందుబాటులో ఉంటాయి. మార్కుల మెమోలు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లలో టీజీపీఎస్సీ ఐడీ, హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ, తమ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
మార్కుల మెమోలు డౌన్‌లోడ్ కోసం క్లిక్ చేయండి
అలాగే, జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5గంటలవరకు అందుబాటులో ఉంటుంది. ఈ జాబితా ఆధారంగా అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామని కమిషన్ తెలిపింది. అలాంటి అభ్యర్థులకు వ్యక్తిగతంగా, టీజీపీఎస్సీ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అందువల్ల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే అభ్యర్థులు టీజీపీఎస్సీ టెక్నికల్ హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 040-23542185 లేదా 040-23542187 లేదా helpdesk@tspsc.gov.in ద్వారా సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో సూచించింది.
గ్రూప్ -1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితా