GATE 2025 Results | గేట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :19 Mar 2025 14:44 IST
https://results.eenadu.net/news.aspx?newsid=gate-2025-results-19032025
GATE 2025 Results | ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగ్గా.. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన ఐఐటీ రూర్కీ అధికారులు.. బుధవారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ/ఈ-మెయిల్ అడ్రస్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఎంటర్ చేసి స్కోరు కార్డు పొందొచ్చు.
గేట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
మొత్తం 30 సబ్జెక్టులకు గేట్ పరీక్షను ఐఐటీ రూర్కీ(IIT Roorkee) నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మొత్తం 8.37 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. సుమారు 80 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు అంచనా. స్కోరు కార్డులు మార్చి 28 నుంచి మే 31వరకు డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచనున్నారు. ఆ వ్యవధి దాటినట్లయితే.. అభ్యర్థులు తమ స్కోర్ కార్డులు డౌన్‌లోడ్ కోసం ప్రతి పరీక్ష పేపర్‌కు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.