Postal Jobs| తపాలాశాఖలో 28వేల ఉద్యోగాలు.. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) పోస్టుల భర్తీకి సంబంధించి ఎంపికైన వారి తొలి షార్ట్‌లిస్ట్ విడుదలైంది.
By Education News Team
Updated :07 Mar 2026 14:54 IST
https://results.eenadu.net/education-news/Postal-GDS-2026-First-shortlist-candidates-List-released
ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఉద్యోగాల భర్తీకి తపాలా శాఖ జనవరిలో భారీ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే(India Post GDS Result 2026). మొత్తం 28,636 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల తొలి జాబితాలను తపాలాశాఖ అధికారులు రాష్ట్రాల వారీగా తమ వెబ్సైట్లో ఉంచారు. మొత్తం ఉద్యోగాల్లో ఏపీ నుంచి 1060 ఖాళీలు ఉండగా.. తెలంగాణ నుంచి 608 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే, ఈ పోస్టుల భర్తీకి సంబంధించి షార్ట్‌లిస్ట్ చేసి విడుదల చేసిన తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 1048మంది ఉండగా.. తెలంగాణ నుంచి 607మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. (India post GDS Results)
ఏపీ నుంచి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా
ఈ మొదటి జాబితాలో ఎంపికైన అభ్యర్థులు మార్చి 23లోగా డివిజనల్ ఆఫీస్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల ఫొటోకాపీలను వెంటతీసుకెళ్లాలని తపాలా శాఖ అధికారులు సూచించారు. అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కులు/ గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఈ ఎంపికలు చేపట్టారు. కంప్యూటర్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేశారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ ఈ-మెయిల్/ పోస్టు ద్వారా అందుతుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
తెలంగాణ నుంచి షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితా