APRJC, APRDC CET 2025 Results | ఏపీ ‘గురుకుల’ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు కోసం క్లిక్ చేయండి
ఏపీలో గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :14 May 2025 16:08 IST
https://results.eenadu.net/news.aspx?newsid=aprjc-and-aprdc-results
ఇంటర్నెట్ డెస్క్: ఏపీలో గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలైనట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఫలితాలను ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (APREIS) బుధవారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (APRS CAT 2025) నిర్వహించగా.. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఏపీఆర్‌జేసీ(APRJC), ఏపీఆర్‌డీసీ(APRDC) ప్రవేశ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ర్యాంక్ కార్డుల కోసం క్లిక్ చేయండి
ఈ ఫలితాల్లో టాపర్లు, అర్హత సాధించిన వారికి మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. మొత్తంగా 7190 సీట్లు అందుబాటులో ఉండగా.. 73,993మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 62,047మంది పరీక్ష రాసినట్లు తెలిపారు.
ఫలితాలు పొందండి ఇలా..
https://aprs.apcfss.in/ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు ఐదో తరగతి, ఆరు, ఏడు, ఎనిమిదో తరగతి, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ పేజీల్లో తాము రాసిన తరగతికి సంబంధించిన పేజీని ఎంచుకోవాలి. ర్యాంక్ రిజల్ట్‌పై క్లిక్ చేయాలి. అక్కడ క్యాండిడేట్ ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ర్యాంక్ కార్డులను పొందొచ్చు.