JEE Main Admit Cards: 21 నుంచే జేఈఈ మెయిన్ పరీక్ష.. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేశారా?
జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main 2026) పరీక్షకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. ఈ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
By Education News Team
Published :19 Jan 2026 17:02 IST
https://results.eenadu.net/news.aspx?newsid=JEE-Main-2026-admitcards-download
JEE Main Admit Cards | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ సెషన్-1 (JEE Main 2026) పరీక్షకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్‌టీఏ అధికారులు.. ఈ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 21 నుంచి 29వరకు ఈ పరీక్షలు జరగనుండగా.. 21, 22, 23, 24 తేదీల పరీక్షలకు అడ్మిట్ కార్డుల్ని jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 28, 29 తేదీల్లో పరీక్షలకు అడ్మిట్ కార్డుల్ని తర్వాత విడుదల చేస్తారు.
దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్ష, 29న పేపర్ -2 పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. మొత్తం రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 011-40759000 లేదా jeemain@nta.ac.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- హోంపేజీలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2026 సెషన్-1కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది. దాన్ని ప్రింటవుట్ తీసుకోవచ్చు.