CMAT 2026 Admit Card | సీమ్యాట్‌-2026 అడ్మిట్‌ కార్డులు విడుదల

CMAT 2026 Admit Card | సీమ్యాట్‌-2026 అడ్మిట్‌ కార్డులు విడుదల

బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)కు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :21 Jan 2026 18:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు (సీమ్యాట్‌)కు అడ్మిట్‌ కార్డులు (CMAT 2026 Admit Cards) విడుదలయ్యాయి. జనవరి 25న జరగనున్న ఈ పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డులను ఎన్‌టీఏ(NTA) బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అభ్యర్థులు అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు జరగనుంది. డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు హెల్ప్‌డెస్క్‌ నంబర్‌ 011-40759000 లేదా cmat@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు.