telangana ICET 2024 Hall tickets released | తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

ICET Hall tickets: తెలంగాణ ఐసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణలో ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు పొందొచ్చు.

Published : 31 May 2024 18:05 IST

ICET Hall tickets| హైదరాబాద్‌: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్‌ (Telangana ICET 2024)కు  ఉన్నత విద్యామండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  జూన్‌ 5, 6 తేదీల్లో జరిగే  ఈ పరీక్షకు శుక్రవారం సాయంత్రం హాల్‌టికెట్లను (ICET Halltickets) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేసి రిజిస్ట్రేషన్ నంబర్‌, పుట్టిన తేదీ, క్వాలిఫయింగ్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా అభ్యర్థులు తమ హాల్‌టికెట్లు పొందొచ్చు. షెడ్యూల్‌ ప్రకారం.. జూన్‌ 15న TG ICET ప్రిలిమినరీ కీ విడుదల చేసి.. 16 నుంచి 19వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జూన్‌ 28న ఫలితాలు విడుదల చేయనున్నారు.  ఐసెట్‌కు ఈసారి రికార్డుస్థాయిలో 80వేల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి