NEET UG 2024 Key Released | నీట్‌ (యూజీ) ప్రిలిమినరీ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?

NEET UG Key: నీట్‌ (యూజీ) ప్రిలిమినరీ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే??

దేశ వ్యాప్తంగా వైద్య విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ (యూజీ) ప్రిలిమినరీ కీ విడుదలైంది.

Published : 30 May 2024 15:55 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2024) కీ విడుదలైంది.  ఈ కీని నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)గురువారం విడుదల చేసింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల్లోగా ఆన్‌లైన్‌లో ప్రశ్నకు రూ.200 చొప్పున చెల్లించి కీపై అభ్యంతరాలు తెలపవచ్చని ఎన్‌టీఏ అధికారులు సూచించారు. షెడ్యూల్‌ ప్రకారం.. నీట్‌ ఫలితాలు జూన్‌ 14న విడుదలయ్యే అవకాశం ఉంది. దేశంలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ (MBBS), బీడీఎస్‌ (BDS), బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం  మే 5న నిర్వహించిన నీట్‌ పరీక్షకు దాదాపు 24లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.

ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి

కీపై అభ్యంతరాలకు క్లిక్‌ చేయండి