AISSEE 2025 Admit cards | సైనిక్ స్కూల్స్‌కు అప్లై చేశారా? ప్రవేశ పరీక్ష అడ్మిట్ కార్డులివిగో!
సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు అడ్మిట్ కార్డులు(AISSEE 2025 Admit cards) విడుదలయ్యాయి.
By Education News Team
Published :27 Mar 2025 15:14 IST
https://results.eenadu.net/news.aspx?newsid=27032025-aissee-2025-admit-cards
ఇంటర్నెట్ డెస్క్: సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు అడ్మిట్ కార్డులు(AISSEE 2025 Admit cards) విడుదలయ్యాయి. ఏప్రిల్ 5న దేశ వ్యాప్తంగా జరగనున్న ఈ పరీక్ష కోసం ఎన్‌టీఏ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి అడ్మిట్ కార్డుల్ని పొందొచ్చు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్నాక అభ్యర్థి ఫొటో, సంతకం, బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని సూచించింది. వీటిలో ఏది మిస్ అయినా.. మళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది.
అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
వచ్చే విద్యా సంవత్సరం(2025-26)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2025) కోసం గతేడాది డిసెంబర్ 24 నుంచి ఈ ఏడాది జనవరి 23వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అడ్మిట్ కార్డులను పోస్టు ద్వారా పంపించబోమని, అందువల్ల వీటిని డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే.. అభ్యర్థులు ఎన్‌టీఏ హెల్ప్‌లైన్ నంబర్లు 011-40759000 లేదా 011-69227700 లేదా మెయిల్ ఐడీ aissee@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది.