UPSC NDA, NA 1 exam Result 2024 out I యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ (1) రాత పరీక్ష ఫలితాలొచ్చేశాయ్‌.. మెరిట్ జాబితా ఇదే..

UPSC NDA Exam Result : యూపీఎస్సీ ఎన్‌డీఏ, ఎన్‌ఏ (1) రాత పరీక్ష ఫలితాలొచ్చేశాయ్‌.. మెరిట్ జాబితా ఇదే..

యూపీఎస్సీ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్ష (1) రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి

Published : 23 May 2024 16:40 IST

దిల్లీ: యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) నిర్వహించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(NDA), నేవల్‌ అకాడమీ(NA) పరీక్ష(1) ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్‌ 21న రాత పరీక్ష నిర్వహించగా.. ఈ టెస్ట్‌లో మెరిట్‌ సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల పేర్లతో జాబితాను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో  7,028మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు.  వీరందరికీ సర్వీసెస్‌ సెలెక్షన్‌ బోర్డు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.  మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులకు సెలెక్షన్‌ సెంటర్లను కేటాయించి షెడ్యూల్‌ను వారి రిజిస్టర్డ్‌ మెయిల్‌ ఐడీకి పంపనున్నట్లు upsc తెలిపింది. ఇంటర్వ్యలూకు వెళ్లే అభ్యర్థులు తమ వయస్సు, విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థుల మార్కుల లిస్ట్‌లను తుది ఫలితాలు విడుదలైన 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఎంపికైన వారికి జనవరి 2 నుంచి అకాడమీ కోర్సు ప్రారంభం కానుంది.

పూర్తి జాబితా కోసం క్లిక్‌  చేయండి

క్వాలిఫై అయిన టాప్‌- 10 అభ్యర్థులు వీళ్లే.. 

  • అర్నవ్‌ రాయ్‌
  • పర్మార్‌ జయ్‌నిల్‌ దినేశ్‌ చంద్ర
  • ఆర్యన్‌ కుమార్‌
  • ఆదిత్య త్రిపాఠి
  • ఆర్యన్‌ అమర్‌నాథ్‌ వర్మ
  • లబనా యువరాజ్‌ ప్రకాశ్‌
  • పటేల్‌ హెట్‌ జగదీశ్‌కుమార్‌
  • రుద్ర హేమంత్‌కుమార్‌ ప్రజాపతి
  • కుల్దీప్‌ సింగ్‌
  • పటేల్‌ కాశిష్‌ రమాభాయి