Railway Jobs | టెన్త్/ఐటీఐ చదివారా? రైల్వేలో 32,438 పోస్టులు.. దరఖాస్తులు షురూ!
రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపు 32 వేలకు పైగా లెవెల్ -1 (గ్రూప్ డి) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.
By Education News Team
Published : 23 Jan 2024 00:15 IST
https://results.eenadu.net/news.aspx?newsid=23012025
Railway Jobs | ఇంటర్నెట్ డెస్క్: రైల్వే శాఖ(Indian Railways)లో భారీగా ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలైంది. టెన్త్/ఐటీఐ విద్యార్హతతో గ్రూప్-డి లెవెల్ -1 కేటగిరీలో వివిధ విభాగాల్లో మొత్తం 32,438 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..
- వయో పరిమితి: జనవరి 1, 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్/ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీల కింద అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
- విద్యార్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత లేదా ఐటీఐ లేదా తత్సమాన విద్యార్హత లేదా NCVT జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అర్హులు.
- పోస్టుల వివరాలు: సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ ( ఎస్ అండ్ టీ), మెకానికల్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ తదితర విభాగాల్లో అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ), వర్క్‌షాప్ అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్ (డీజిల్/ఎలక్ట్రికల్/) పాయింట్స్‌మన్, అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, ట్రాక్ మెయింటెయినర్ తదితర పోస్టులు ఉన్నాయి.
- ప్రారంభ వేతనం: నెలకు రూ.18 వేలు చొప్పున ఇస్తారు.
- ఎంపిక ఇలా..: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- పరీక్ష ఎలా ఉంటుంది?: ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. 90 నిమిషాల పాటు జరిగే ఈ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ సైన్స్ నుంచి 25 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. తప్పు సమాధానం రాస్తే 1/3 మార్కుల కోత విధిస్తారు.
- దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500; దివ్యాంగులు/మహిళలు, ట్రాన్స్‌జెండర్లు/ఎక్స్‌సర్వీస్‌మెన్/ఎస్సీ/ఎస్టీ/మైనార్టీ వర్గాలు/ఈబీసీలు రూ.250 చొప్పున చెల్లించాలి. పరీక్షకు హాజరయ్యాక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.400, మిగతా వారికి రూ.250 రిఫండ్ చేస్తారు.
- దరఖాస్తుల్లో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 రాత్రి 11.59 గంటల వరకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ.250 (నాన్ రిఫండబుల్) చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 6 తర్వాత దరఖాస్తుల్లో మార్పులకు ఎలాంటి అవకాశం ఉండదు.
- దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 0172-565-3333, 9592001188కు కాల్ చేయవచ్చు. లేదా rrb.help@csc.gov.in ఈ- మెయిల్ ద్వారా సహాయం పొందొచ్చు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు (పని దినాల్లో మాత్రమే) సంప్రదించాలి.
- రైల్వే జోన్‌ల వారీగా భర్తీ చేసే ఉద్యోగాలు, వయో పరిమితిలో రిజర్వేషన్లు, రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న బుక్‌లెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.