UPSC Civil Services: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 దరఖాస్తుల గడువు పొడిగింపు

UPSC Civil Services: యూపీఎస్సీ సివిల్స్‌ 2025 దరఖాస్తుల గడువు పొడిగింపు

అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి ఏటా నిర్వహించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు.

Eenadu icon
By Education News Team Updated :09 Feb 2025 15:25 IST

UPSC CSE 2025 Applications | దిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష దరఖాస్తుల గడువును యూపీఎస్సీ(UPSC) వారం రోజుల పాటు పొడిగించింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపు 979  పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSE) 2025 పరీక్షకు గత నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే.  UPSC CSE 2025 పరీక్షకు జనవరి 22న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ వాస్తవానికి ఫిబ్రవరి 11తో ముగియనుండగా.. తాజా నిర్ణయంతో అభ్యర్థులు ఫిబ్రవరి 18వ తేదీ సాయంత్రం 6గంటల వరకు అప్లై చేసుకొనేందుకు అవకాశం లభించింది.  ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. మరోవైపు, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో మరో 150 పోస్టులకు సైతం దరఖాస్తుల గడువును ఫిబ్రవరి 18వరకు పెంచారు.  దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని ఫిబ్రవరి 19 నుంచి 25వ తేదీ వరకు సవరించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు యూపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది.

యూపీఎస్సీ సివిల్స్‌కు దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి 

సివిల్స్‌ నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలు.. 

  • విద్యార్హతలు: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన  విద్యాసంస్థల నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
  • వయో పరిమితి: అభ్యర్థుల వయసు 21నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా మినహాయింపు ఉంది.
  • దరఖాస్తు రుసుం: ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ,  దివ్యాంగులకు ఫీజు మినహాయింపు)
  • ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు (400 మార్కులకు) ఉంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్  రూపంలో ఇస్తారు. ఈ  ప్రశ్నల్లో నెగెటివ్ మార్కులు కూడా  ఉంటాయి. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ రాసేందుకు అనుమతిస్తారు. 
  • మెయిన్స్‌ పరీక్ష: ఇది డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది.మెయిన్స్‌లో సత్తా చాటిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. 
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలివే..: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌ 
  • మెయిన్స్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

ఇండియన్ ఫారెస్ట్‌ సర్వీస్‌ పోస్టులకు దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి