CTET 2026 Admit Cards| సీటెట్‌  అడ్మిట్‌ కార్డులు విడుదల

CTET 2026 Admit Cards| సీటెట్‌  అడ్మిట్‌ కార్డులు విడుదల

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అడ్మిట్‌ కార్డులు(CTET Admit Cards 2026) విడుదలయ్యాయి.

Eenadu icon
By Education News Team Updated :05 Feb 2026 15:48 IST

CTET 2026 Admit Cards| ఇంటర్నెట్ డెస్క్‌: సీబీఎస్‌ఈ (CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు అడ్మిట్‌ కార్డులు(CTET Admit Cards 2026) విడుదలయ్యాయి.  దేశ వ్యాప్తంగా 140 నగరాల్లో ఫిబ్రవరి 7, 8 తేదీల్లో (శని, ఆదివారాల్లో) జరగనున్న ఈ పరీక్షకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం అడ్మిట్‌ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, క్యాప్చాకోడ్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

సీటెట్‌ అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

సీటెట్‌ను తొలుత ఫిబ్రవరి 8న ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, ఈసారి భారీ సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తిన నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పేపర్‌-2; మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌ -1 పరీక్ష జరగనుంది. సీటెట్‌ రెండు రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు తాము డౌన్‌లోడ్‌ చేసుకున్న అడ్మిట్‌ కార్డులను జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు. అడ్మిట్‌ కార్డుపై పరీక్ష తేదీ, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయాల్సిన సమయం, ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలను ఓసారి జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. 

సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. సీటెట్‌ (ఫిబ్రవరి 2026 సెషన్‌)కు దేశ వ్యాప్తంగా దాదాపు 25లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది. సీటెట్‌లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు పేపర్-1ను​; ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలనుకునే పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది.